అదుగో రివ్యూ

0
15
Adugo Review
Adugo Review

విడుదల తేదీ : నవంబర్ 7, 2018
CB రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : రవి బాబు
నిర్మాత : సురేష్ బాబు

ఎప్పుడూ కూడా ప్రయోగాత్మక కథలతో,అబ్బురపరిచే కథాంశాలతో అందరిని ఆకట్టుకునే రవిబాబు చాలాకాలంగా ఒకే సినిమా తో బిజీ గా ఉన్నాడు.ఆ సినిమా పేరు అదుగో.ఒక పందిపిల్ల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించాడు రవిబాబు.ఎటిఎం లైన్ లో పందిపిల్ల తో నుంచోవడం,పందిపిల్లతో పుల్ అప్స్ చెయ్యడం,అదే పందిపిల్లతో పాదయాత్ర లాంటి స్ట్రాటజీస్ తో ఆ సినిమాకి మంచి బజ్ తీసుకురాగలిగాడు.ఆ సినిమా ఈ రోజు దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చింది.

కథ: ఒక మారుమూల పల్లెటూరులో చంటి అనే పిల్లడు బంతి అనే పదిపిల్లను పెంచుకుంటూ ఉంటాడు.అయితే దాన్ని కిడ్నాప్ చేసి హైదరాబాద్ కి తీసుకొస్తారు ఇద్దరు రౌడీలు.అయితే అనుకోకుండా అదే పందిపిల్ల అనేక రౌడీ గ్రూపులతో అవసరపడుతుంది.మరో పక్క తన పందిపిల్లను వెదుక్కుంటూ హైదరాబాద్ చేరుకుంటాడు చంటి.అసలు ఆ పందిపిల్లతో ఆ రౌడీ గ్రూపులకు పనేంటి?,చివరకు చంటి బంటీ ని వెదికిపట్టుకున్నాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:ఎప్పుడూ కూడదా కాస్త రొటీన్ కి భిన్నంగా ఓవర్ ది టాప్ ఉండే కథలనే ఎంచుకునే రవిబాబు ఈ సారి కూడా అలాంటి ఒక డిఫరెంట్ సెట్ అప్ నే సృష్టించుకున్నాడు.కాకపోతే దాంట్లోకి పందిపిల్లను తెచ్చాడు.అయితే చిన్న సినిమా అని మొదలు పెట్టిన దీంట్లో లెక్కలేనన్ని పాత్రలు క్రియేట్ చేసాడు.మళ్ళీ ప్రతి పాత్రకు ఒక్కో ఇంట్రడక్షన్.ఇలా చాలా సేపు అనేకపాత్రల పరిచయంతోనే సాగిపోయింది.పైగా మెయిన్ కథకి మధ్యలో ఉన్న సబ్ ప్లాట్స్ కి సరైన లింక్ అప్ లేదు.కథలో కామెడీ ఉండడం వేరు కథనే కామెడీ గా కిచిడిలా వండుకోవడం వేరు.ఇక్కడ కథ విషయంలో రవిబాబు అప్రోచ్ అలానే ఉంటుంది.ఎదో అమరావతి దగ్గర పొలాలు అంటూ రెండు గ్యాంగ్స్,సిటీ లో యానిమల్ రేసులు అంటూ ఒక రెండు గ్యాంగ్స్,మధ్యలో ఒక ప్రేమ కథ….వీటన్నటికి ముడిపెడుతూ ఒక పందిపిల్లకథ.ఇలా అనేకపాత్రలతో రాసుకున్న కథలో పెద్దగా విషయంలేకపోగా తోచినట్టుగా సీన్స్ రాసుకుని, నచ్చినట్టుగా తీసేసాడు అని అర్ధమవుతుంది.దాంతో సినిమా గందరగోళంగా తయారయ్యింది.గబ్బర్ సింగ్ సినిమాలో కంటే ఎక్కువ బుల్లెట్స్ ఈ సినిమాకి వాడారు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.అసలు పందిపిల్ల అనే అగ్లీ యానిమల్ ని ఆడియెవ్స్ కి కనెక్ట్ చెయ్యడం చాలా కష్టం.ఆ పాయింట్ ను ఎంచుకున్నందుకు రవిబాబు డేర్ ని మెచ్చుకోవాలి.కొన్ని సంవత్సరాలుగా షూటింగ్ లో ఉండడం కూడా ఈ సినిమాకు ప్రతికూల అంశం.అయినప్పటికీ పందిపిల్ల ను సెంటర్ చేసి తీసిన కొన్ని సీన్స్ పిల్లలకు బాగా కనెక్ట్ అవుతాయి.ఎమోషన్ మాత్రం అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు…దాంతో ఫీల్ కూడా బాగా తగ్గింది.కొన్ని సిల్లీ సీన్స్ సినిమా స్టాండర్డ్ ని కూడా తగ్గించేసేలా ఉన్నాయి.క్లయిమాక్స్ వరకు ఓకే అనిపిస్తుంది.గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా మరీ అంత రిచ్ గా లేదు కానీ రియలిస్టిక్ ఫీల్ అయితే వచ్చింది.

నటీనటులు:ఈ సినిమాలో నటీ నటులంతా కూడా రవిబాబు చూపించిన దారిలో ఓవర్ ది టాప్ యాక్టింగ్ చేసారు.వాటిలో ఎక్కువ శాతం ఓవర్ యాక్షన్ అనిపిస్తాయి.రవి బాబు కూడా తనకి బాగా అలవాటున్న చిన్న విలన్ పాత్రలో కనిపించాడు.నన్నుదోచుకుందువటే సినిమాలో త నటనతో అందరిని ఆకట్టుకున్న నభా నటేష్ కి ఇదే మొదటి సినిమా.అయినా కూడా ఎక్కడా తడబాటు లేకుండా కనిపించింది.ఈ సినిమాలో ఆమె అప్పీరెన్స్ కూడా ఆకట్టుకుంటుంది.ఆ మధ్య సూసైడ్ చేసుకున్న కమెడియన్ విజయ్ కూడా ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు.అనేక మంది కొత్త ఆర్టిస్టులు ఈ సినిమాతో పరిచయం అయ్యారు.ఇక పందిపిల్లకు రాజేంద్ర ప్రసాద్ వాయిస్ కూడా బాగానే ఉంది.

టెక్నీషియన్స్:ఈ సినిమాకి కర్మ,కర్త,క్రియ అయిన రవిబాబు సినిమా స్టార్టింగ్ లో వేసిన పేర్లతోనే కొత్తదనం చూపించి సినిమాపై ఆశలు రేపాడు.అలానే ఈ సినిమాకి కుదిరిన సెట్ అప్ కూడా బావుంది.కాకపోతే స్క్రీన్ ప్లే లో ఉన్న కొన్ని సిల్లీ సీన్స్ ,అలాగే కంఫ్యూజ్డ్ స్క్రీన్ ప్లే ఆర్డర్ ని సెట్ చేసుకోవడంలో మాత్రం డైరెక్టర్ గా రవి బాబు విఫలం అయ్యాడు.ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా అయిన రవిబాబు ఈ సినిమాకోసం బాగానే ఖర్చు చేసాడు.ఇక సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పరంగా చాలా ఎఫర్ట్ పెట్టాడు.అది సినిమాలో కనిపిస్తుంది.యూను మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన టాలెంట్ చూపించుకోగలిగిన అంత స్కోప్ ఈ సినిమా ఇవ్వలేదు.అందుకే సినిమాకి సరిపోయే అండ్ సెట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చాడు.మిగతా టెక్నీషియన్స్ కూడా రవిబాబు మైండ్ సెట్ కి మౌల్డ్ అయ్యి తన టేస్ట్ కి,విజన్ కి కనెక్ట్ అయ్యే అవుట్ ఫుట్ ఇచ్చారు.

చివరిగా: చిన్న పాయింట్ తో పందిపిల్లను కూడా కనెక్ట్ చేస్తూ రవిబాబు చేసిన ఈ సినినిమాలో కొన్ని కొన్ని విషయాలు బాగానే ఉన్నా కొన్ని మాత్రం ఇబ్బంది పెట్టాయి.ఓవర్ ఆల్ గా చూసుకుంటే ఈ సినిమా చిన్నపిల్లలకి తప్ప మిగాతా వాళ్ళకి అప్పీల్ అయ్యే అంశాలు ఎక్కువగా లేకుండా తెరకెక్కింది.సో,ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు పెర్ఫార్మ్ చెయ్యగలుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here