ఆలీతో కలసి రొట్టెల పండుగ పాల్గోనున్న పవన్ కళ్యాణ్

0
170

పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సినీ నటుడు ఆలీతో కలసి రొట్టెల పండుగకు హాజరవడంతో పాటు బారాషహీద్‌ దర్గాలో ప్రార్థనలు నిర్వహించనున్నారు.

ప్రముఖ కమెడియన్ ఆలీ జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ తో కలసి ఈ పర్యటన నిర్వహిస్తుండటం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. ఈ తాజా పరిణామంతో ఆలీ జనసేనలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన చిరకాల మిత్రుడు, సినీ నటుడు అలీతో కలిసి ఆదివారం ఉదయం 11గంటలకు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో ప్రార్ధనలు నిర్వహించనున్నట్లు తెలిసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంటకు విమానంలో బయలుదేరిన పవన్ కల్యాణ్ అక్కడనుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు చేరుకుంటారు.

పవన్ కళ్యాణ్ తొలుత నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో ఆలీతో కలసి పాల్గొన్న అనంతరం బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండుగకు మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి స్వర్ణాల చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, మరియు నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు.

AP Nరాజకీయపరంగా తనకు అనుకూలంగా ఉండే చోట జనసేన తరుపున ఆలీ బరిలోకి దిగడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అనంతరం అక్కడ వున్న రాజకీయ నాయకులతో మీటింగ్ ఉంటది అని చెప్పటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here