ఇక యాక్షన్ హీరో డైరెక్షన్ ఫిక్స్ !

0
42
Vishal

వరుస సినిమాలతో పాటు, అటు సామాజిక సేవలతోనూ ఎప్పుడూ బిజీ బిజీగా గడిపే యాక్షన్ హీరో విశాల్ త్వరలో డైరెక్షన్ చెయ్యబోతున్నారు. తనకు డైరెక్షన్ మీద చిన్నప్పటినుంచీ ఆసక్తి ఉందని.. అందుకే యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసానని.. అయితే ఆ తరువాత అనుకోకుండా హీరోగా మారి అలాగే కంటిన్యూ అవుతున్నానని.. గతంలో ఓ ఇంటర్వ్యూలో విశాల్ చెప్పుకొచ్చాడు.

అయితే విశాల్ డైరెక్ట్ చెయ్యబోయే మూవీ మాత్రం చాలా వైవిధ్యంగా ఉండబోతుందట. ఎందుకంటే ఆయన డాగ్స్ మీద ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా కోలీవుడ్ సినీవర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కానుందట.

ఇక విశాల్ ప్రస్తుతం ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ ను ‘అయోగ్య’ పేరుతో తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్ మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here