ఎన్టీఆర్ కోసం మేకప్ మేన్ గా మారిన మాటల రచయిత !

0
35
NTRBiopic
NTRBiopic

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆ కాలం లెజండరీ మేకప్ మేన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పీతాంబరం పాత్రలో రచయిత సాయి మాధవ్ బుర్రా నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో సాయి మాధవ్ పై చిత్రబృందం చిత్రీకరణ కూడా జరిపిందట. పీతాంబరంగా సాయి మాధవ్ చాలా బాగా నటిస్తున్నారట.

ఇక ఎన్టీఆర్ మొదటి సినిమా నుండి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేంతవరకు ఆయనకు మేకప్ మేన్ పీతాంబరమే కావడం విశేషం. పీతాంబరం ఎన్టీఆర్ తో పాటు ఎమ్జీఆర్ కి కూడా మేకప్ మేన్ గా పని చేశారు. పైగా పీతాంబరంకి ఎన్టీఆర్ గారితో మంచి అనుభందం కూడా ఉందట.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here