కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీపీఐ !

0
28
congress & CPI
congress & CPI

తెలంగాణలో జరగబోయే ముందస్తు ఎన్నికల హడావుడి రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే తెరాసా అధినేత కేసీయార్ శరవేగంగా తమ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కానీ మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంచు కోవటంలోనే తలమునకలై ఉంది. దీంతో విసుగెత్తిన సీపీఐ పార్టీ తాము పోటీ చేయబోయే 9 స్థానాలు ఇవే అంటూ ప్రకటించేకుంది. వాస్తవానికి సిపిఐ తమకు గౌరవప్రదంగా ఐదు స్థానాలైన ఇవ్వమని అడుగుతూ వచ్చింది, కాంగ్రెస్ మాత్రం వారు అడిగిన సీట్లు ఇవ్వలేకో, ఇవ్వటం ఇష్టంలేకో మొత్తానికి నాన్చుతూ వచ్చింది. దీంతో సిపిఐ నాయకుడు నారాయణ కాంగ్రెస్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు.

సిపిఐ నారాయణ మాటాడుతూ ‘అధికార పార్టీని ఓడించాలంటే.. కలిసామని చెప్పుకుంటే సరిపోదు. కలిసికట్టుగా పోరాడాలి. కానీ తమ పార్టీ ఏ సీటు అడిగినా మేం ఓడి పోతాం అంటుంది కాంగ్రెస్. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తుందా, అలా అని రాసివ్వగలదా?”అంటూ ఆయన సూటి ప్రశ్న వేశారు.

కాంగ్రెస్ ఆలస్యం చేయటం వల్లే సమయం వృధా అవుతుందని, ఏ స్థానాలు కేటాయిస్తారో తెలియకపోతే ప్రచారం ఎలా చేసుకుంటాం అంటూ సిపిఐతో పాటు మిగిలిన మహాకూటమి పార్టీలు కూడా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏమైనా మహాకుటమి సీట్ల పంపకంలో కాంగ్రెస్ త్వరపడటం మంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here