‘చిత్రలహరి’ చిత్రీకరణ మొదలు కానుంది !

0
29
Chitralahari, Sai Dharam Tej, Kalyani Priyadarshan
????????????????????????????????????

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ‘హలో’ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటించనున్నారు.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12న ప్రారంభం కానుంది. ఏకంగా 40 రోజుల పాటు జరిగే ఈ మొదటి షెడ్యూల్ లో.. దాదాపు 60 శాతం షూటింగ్ ను పూర్తి చేయనున్నారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఇక ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా వున్నాడు సాయిధరమ్ తేజ్. మరి ఈ చిత్రంతో తేజ్ నిజంగానే భారీ విజయం సాదిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here