థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రివ్యూ

0
37
Thugs Of Hindostan, Amir Khan, AmitabhBachchan
Thugs Of Hindostan, Amir Khan, AmitabhBachchan

విడుదల తేదీ : నవంబర్ 08, 2018
CB రేటింగ్ : 2.75/5
నటీనటులు : అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమిర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్ తదితరులు
దర్శకత్వం : విజ‌య్ కృష్ణ ఆచార్య‌
నిర్మాత : ఆదిత్య చోప్రా
సంగీతం : అజ‌య్‌, అతుల్‌
స్క్రీన్ ప్లే : విజ‌య్ కృష్ణ ఆచార్య‌

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన బాలీవుడ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ఇండియాలో ఏ రేంజ్ లో రిలీజ్ అయ్యిందో ఇంటర్నేషనల్ గా అంతకంటే గొప్పగా రిలీజ్ అయ్యింది.చైనాలో ఫస్ట్ టైం సైమల్టేనియస్ రిలీజ్ కి వెళ్ళాడు అమీర్ ఖాన్.ప్రస్తుతం టెర్రిఫిక్ ఫామ్ లో ఉన్నఅమీర్ ఖాన్ సినిమా కావడం,అమితాబ్ ఈ సినిమాలో నటించడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ తో దుమ్మురేపడం,కత్రినా,ఫాతిమా సనా షేక్ లాంటి వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఉండడం తో ఈ సినిమా కి మామూలు హైప్ రాలేదు.బాహుబలికి రికార్డ్స్ ని కొల్లగొట్టే కాంపిటీటర్ అని ప్రచారం కూడా జరిగింది.మరి అంత భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పడు చూద్దాం

కథ:ఇండియా మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఎదురు తిరిగిన రాజులను చంపి మరీ వారి రాజ్యాలను స్వాధీనం చేసుకునేది.అలా దుర్గాపూర్ మహారాజుని కూడా చంపి అతని రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు.అయితే ఆ రాజుకూఁతురు అయిన జఫీరా ని రక్షించిన ఖుదా బక్ష్ అలియాస్ ఆజాద్ వీలుచిక్కినప్పుడల్లా తన దళంతో కలిసి తెల్లవాళ్ళను దెబ్బకొడుతూ,వాళ్ళ నౌకలు అవీ దోపిడీ చేస్తుంటాడు.అయితే వాళ్ళను పట్టుకోవడానికి డబ్బుకోసం ఎంతకయినా దిగజారే ఫిరంగి మల్లయ్యతో డీల్ కుదుర్చుకుంటారు.ప్లాన్ ప్రకారం ఖుదా బక్ష్ కి దగ్గరయిన మల్లయ్య వాళ్ళను పట్టించాడా?,ఆజాద్ వ్యూహాలు ఎలా నెరవేరాయి?,జాఫీరా తన తండ్రిని చమిం వాళ్ళమీద ప్రతీకారం తీర్చుకుందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:ఈ సినిమాకి ఉన్న హైప్ కి,ఈ సినిమాలో కంటెంట్ కి అస్సలు సంబంధం లేదు.అసలు ఈ సినిమాలో కథ అన్నదే లేకపోవడం మరీ విచిత్రం అనిపిస్తుంది.అలాంటపుడు అంతమంది ఉద్దండులు ఈ సినిమాని ఏం చూసి ఓకే చేసారా అని ఆశ్చర్యం వేస్తుంది.ఫార్ములా ప్రకారం అందరిని పరిచయం చేసి ఆ తరువాత ఒక ఆర్డర్ ప్రకారం సీన్స్ రాసుకుంటూ వెళ్లిపోయారు.కానీ ఆ సీక్వెన్స్ లో లాజిక్ మిస్ అయిపోయిన విషయం కూడా గుర్తించలేదు.సినిమా ఆరంభంలో అమీర్ ఖాన్ పాత్ర కాస్త డిఫరెంట్ గా ఉంది ఆసక్తి రేపుతుంది.ఆ తరువాత అదే పదే పదే రిపీట్ అవుతుండడంతో చిరాకు వస్తుంది.షిప్స్ ని కొల్లగొట్టడం దగ్గరి నుండి అనేక అంశాలు పక్క రొటీన్ గా సాగుతూ విసిగిస్తాయి.ఇంత పెద్ద సినిమాకి రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా చెప్పుకోదగ్గ మెరుపులు లేవు.ఎదో ఒక రొటీన్ మాస్ అండ్ రెగ్యులర్ రివెంజ్ సినిమాకి రాసుకున్న సీన్స్ లా ఉన్నాయి అన్నీ.అలా ఖుదా బక్ష్ పాత్రకి ఇచ్చే ట్విస్ట్,క్లైమాక్స్ లో షిప్ లోకి కత్రినా రావడం,అంతాబలమయిన మిలిటరీ వ్యవస్థను విచ్చిన్నం చేసి బ్రిటిష్ ఆఫిసర్స్ ని చంపడం వంటివి చాలా సిల్లీ గా ఉంటాయి.ఇక ఈ సినిమాలో ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా చక్కగా మన రీజినల్ లాంగ్వేజెస్ మాట్లాడేస్తుంటారు.అది క్రికెట్ మ్యాచ్ కి మన భాషల్లో వచ్చే కామెంట్రీ అలా అనిపిస్తుంది.అందులో ఒక ఆఫీసర్ ఏకంగా ఇండియాకి సపోర్ట్ చెయ్యడం చూస్తే అసలు ఈ సినిమా ఫైనల్ వెర్షన్ రిలీజ్ చేసారా? లేక కన్ఫ్యుస్ అయ్యి పక్కనపడేసిన ఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేసారా అనే డౌట్ వస్తుంది.300 కోట్ల ఖర్చు సినిమాలో ఎక్కడ కనిపించదు.థగ్స్ అంటే ఎదో సముద్రంలో షిప్స్ మీద తిరుగుతూ,పక్క షిప్స్ ని దోచుకోవడం లేక ధ్వంసం చేస్తూ విధ్వసం సృష్టించడం అనే మీనింగ్ ఒక్కటే తెలిసినట్టు ఉంది ఈ సినిమా మేకర్స్ కి.అందుకే అసలు కథే లేని సినిమాలో అతికించిన ముక్కల్లాంటి అలాంటి సీన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.ఇది మాత్రం ఏ మాత్రం కన్వీన్స్ చెయ్యలేని వర్త్ లెస్ కాస్ట్లీ మిస్టేక్.

నటీనటులు:ఈ సినిమాకి ఆకర్షణలు అంటే అతిపెద్ద స్టార్ కాస్ట్ అండ్ ఈ సినిమా చిత్రీకరణకు ఎంచుకున్న లొకేషన్స్.కానీ ఆ రెండిటికి ఈ సినిమాని సేవ్ చేసేంత శక్తి లేదు.అమీర్ ఖాన్ తన పాత్రవరకు పూర్తి న్యాయం చేసాడు.అతని వేషధారణ కూడా విభిన్నంగా కనిపిస్తుంది.ఇక ఈ వయసులో కూడా అమితాబ్ చేసిన యాక్షన్ సీన్స్ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.చాలా రిస్కీ స్టoట్స్ చేసాడు.ఫాతిమా సనా షేక్ కి బాణాలు వేసే సీన్స్ తప్ప మామూలుగా కనిపించే సీన్స్ పెద్దగా లేవు.కత్రినాది జస్ట్ ఒక గెస్ట్ క్యారెక్టర్ అనేలా ఉంటుంది.ఫారెన్ యాక్టర్స్ ఆహార్యం బావున్నా వాళ్ళు లోకల్ లాంగ్వేజెస్ స్ఫష్టంగా మాట్లాడడం మాత్రం బాలేదు.మిగతా వాళ్లంతా కూడా ఎదో ఒక సెట్ ప్రాపర్టీ లా ఫ్రేమ్ ని ఫిల్ చెయ్యడానికి పనికొచ్చారు.

టెక్నీషియన్స్:ఈ సినిమా ధూమ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ కృష్ణ ఆచార్య రూపొందించిందేనా అనే డౌట్ సినిమా మొదలయిన కొద్దీ సేపటికే వస్తుంది.లెజెండరీ రైటర్ అయిన ఆదిత్య చోప్రా ఈ సినిమా స్క్రిప్ట్ కి ఎలా అప్రూవల్ ఇచ్చారు అనేది మరో అర్ధం కాని పజిల్.మళ్ళీ ఈ సినిమాకోసం స్పెషల్ గా షిప్స్ తయారుచేయించడం,షూటింగ్ కోసం యూనిట్ అంతా మాల్ట్ కి వెళ్లడం వంటివి జస్ట్ స్టుపిడస్ యాక్ట్స్ అనిపిస్తాయి.థగ్స్ కి ఉన్న మరో బలహీనత మ్యూజిక్.ఒకే ఒక్క థీమ్ మ్యూజిక్ తో సినిమా మొత్తాన్ని నడిపించేవారు అజయ్ అండ్ అతుల్.ఇక ఈ సినిమాలో పాటలగురించి అయితే మాట్లాడుకోకపోవడం బెటర్ అనిపిస్తుంది.టెక్నికల్ గా,థాట్స్ పరంగా మంచి సౌండింగ్ టీమ్ పనిచేసిన ఈ సినిమా మొదలయినదగ్గరినుండి కూడా అవుట్ ఆఫ్ ట్రాక్ లోనే నడుస్తుంది.ఏ దశలోనూ కూడా సినిమా పై ఆసక్తికలిగించలేక డైరెక్టర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు.

చివరిగా: బాహుబలిని దాటేస్తుంది అని అంచనా వేసిన ఈ సినిమా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేనంత దారుణంగా ఉంది.సినిమా యూనిట్ లో ఏ ఒక్కరు కూడా ఈ సినిమా తెరకెక్కుతున్న రియలిస్టిక్ అప్రోచ్ ని గుర్తించలేకపోవడం విశేషం.ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఎదో ఉంటుంది అని ఊహించుకుని వెళ్ళినవాళ్ళు ఆశలపై నీళ్ల్లు చల్లి నీరసం వచ్చేలా చేస్తుంది.మొత్తానికి అమీర్ జైత్ర యాత్రకి థగ్స్ మామూలు బ్రేక్ వెయ్యలేదు.ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా కూడా అదొక వండర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here