దాడి ని ఖండించిన పవన్ కళ్యాణ్…!!

0
101
Pawan kalyan
Pawan kalyan

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైసిపి అధినేత జగన్ ఫై ఈ రోజు మధ్యాహ్నం వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌ అనే వ్యక్తి కత్తి తో దాడి చేసాడు. దీంతో జగన్‌ ఎడమ చేతికి గాయమైంది.ఈ దాడిని ఖండిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖను విడుదల చేసారు.ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షులు శ్రీ వై. ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అమానుషం.

ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగరాదని జనసేన బలంగా విశ్వసిస్తుంది. ఈ హత్యా ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష నేతపై జరిగిన ఈ దాడిని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. గాయం నుండి శ్రీ జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలి అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here