విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ కోసం ‘అల్లు అర్జున్’ !

0
27
VijayDeverakonda, Taxiwala, Alluarjun
నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో  క్రేజీ హీరో  విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా‘. ఈ చిత్రం  ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రత్యేకమైన అతిధి రానున్నాడు.  వివరాల్లోకి వెళ్తే..  అల్లు అర్జున్  ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిధిగా వస్తున్నాడు.  ‘గీత గోవిందం’ చిత్రం  ఆడియో వేడుకకు కూడా  అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చారు, ఆ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. మరి ఈ టాక్సీవాలాకు కూడా ఆ సెంటిమెంట్ కలిసి వస్తోందేమో  చూడాలి.
 
ఇక ఈ ఈవెంట్ నవంబర్ 11వ తేదీన  హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనుంది.  ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. మొత్తానికి ఈ సినిమా  నవంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఇప్పుడు  ఈ చిత్రం ఫలితం,  విజయ్ దేవరకొండ కెరీర్ కి  చాలా కీలకం  కానుంది.    
 
‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి విజయ్ చేరినప్పటికీ, ‘నోటా’ చిత్రం పరాజయంతో.. విజయ్ స్టార్ ఇమేజ్ కంటిన్యూ అవ్వాలంటే  ఈ సినిమా  విజయం సాధించి తీరాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here