వైరల్ అవుతున్న విక్రమ్ లుక్ !

0
54
vikram_newlook
vikram_newlook

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘సామి’ చిత్రం ఇటీవల విడుదలై మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. దీనికి తోడు ఆయన గత కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్న ఈ వైవిధ్యమైన హీరోకి మాత్రం రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూనే ఉంది.

తాజాగా విక్రమ్ రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా నిన్న విడుదలైన ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ హీరో లుక్ లో ఉన్న విక్రమ్ గెటప్ ఒక్కసారిగా సినిమా ఫై అంచనాలను పెంచేసింది.

హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘డోంట్ బ్రీత్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షరా హాసన్ కీలక పాత్రలో నటిస్తుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

Vikram
Vikram

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here