సమీక్ష : పందెంకోడి 2

0
331
PandemKodi2
PandemKodi2

విడుదల తేదీ : అక్టోబర్ 18, 2018
CB రేటింగ్ : 3/5
నటీనటులు : విశాల్, కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రాజ్ కిరణ్, అర్జై , గంజ కరుప్పు , రామ్ దాస్ తదితరులు.
దర్శకత్వం : ఎన్ లింగుస్వామి
నిర్మాత : ఠాగూర్ మధు
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
స్క్రీన్ ప్లే : ఎన్ లింగుస్వామి
ఎడిటర్ : కె ఎల్ ప్రవీణ్

విశాల్ కి పవర్ ఫుల్ మాస్ హీరోగా స్టాండ్ ఇచ్చిన సినిమా పందెంకోడి.ఆ సినిమా వచ్చిన 13 సంవత్సరాలతరువాత ఆ సినిమాకి సీక్వెల్ గా పందెంకోడి 2 తెరకెక్కింది.కీర్తి సురేష్ బబ్లీనెస్,వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ విలనిజం,విశాల్ ఇమేజ్ కి తగ్గ ఫైట్స్….ఇవన్నీ కూడా ట్రైలర్ లో కనిపించడంతో ఈ సినిమాపై కూడా మాస్ ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది,అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈ సినిమా ఆ అంచనాలు ఏ మేరకు అందుకుందో ఇప్పడు చూద్దాం.

కథ:రాజా రెడ్డి చుట్టు పక్కల ఏడు ఊళ్లకు పెద్దమనిషి.అయితే ఏడేళ్ల క్రితం చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లు కలిసి జరుపుకున్నే వీరభద్ర జాతరలో భోజనాల దగ్గర జరిగిన ఓ చిన్నపాటి గొడవలో ఓ రెండు కుటుంబాల మధ్య పగ పెరుగుతుంది. దాంతో ఆ రెండు కుంటుంబాల్లోని ఒక కుటుంబం అయిన భవాని మనుషులు, ఆవతలి కుటుంబంలోని మనుషులందర్నీ చంపేస్తారు. ఇక చంపాల్సిన వ్యక్తి గోపి ఒక్కడు మిగులుతాడు. ఆ వ్యక్తికి అండగా రాజా రెడ్డి నిలబడతాడు. ఉన్న ఆ ఒక్క శత్రువుని కూడా చంపాలని భవానీ మనుషులు ప్రతి నిముషం కాచుకొని ఉంటారు.ఈ నేపధ్యంలో రాజారెడ్డి కొడుకు బాలు చదువుకోసం ఫారెన్ వెళ్లి ఏడు సంవత్సరాల తరువాత ఊళ్ళో జరిగే జాతర కోసం ఊరికి వస్తాడు.అయితే ఆ జాతర జరుగుతుండగానే రాజారెడ్డి ని నరుకుతారు భవాని మనుషులు.కానీ అయన బ్రతకుతాడు.కొడుక్కి మాత్రం ఆ జాతర ఆగ కూడదు,గోపి కి ఏం కాకుండా చుస్కుకోవాలి అని మాట తీసుకుంటాడు.రాజా రెడ్డి కొరకు మేరకు..గోపి ని బాలు ఎలా కాపాడాడు ? మళ్లీ ఆ కుటుంబాల మధ్యన ఎలాంటి గొడవలు రాకుండా బాలు ఏమి చేశాడు ? పగతో రగిలిపోయే భవానీ చివరకు పగని వదిలేసి మాములు మనిషిగా మారుతుందా ? బాలు తన తండ్రి కోరికను నేరవేరుస్తాడా ? లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:పందెంకోడి సినిమా అప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా పూర్తిగా యాక్షన్ బేస్డ్ గా సాగుతుంది.కానీ పందెంకోడి-2 ని మాత్రం కాస్త యాక్షన్ కి దూరంగా,ఎమోషన్ కి దగ్గరగా ఉండేలా డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్ లింగుస్వామి.అయితే ఈ సినిమా కథ రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన అరవింద సమేత ని పోలిఉండడం చెప్పుకోదగ్గ మైనస్.అలాగే ఈ సినిమాలో తమిళ నేటివిటీ కూడా బాగా దట్టించారు.దాంతో ఈ సినిమాలో ఎక్కువభాగం మన వాళ్లకు కనెక్ట్ కావడం కష్టం.యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి.అలాగే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది విలన్ ని తన మాటలతో విశాల్ మార్చే క్లైమాక్స్.అయితే పందెంకోడి తరహాలో ఈ సినిమాలో వినోదం పండించడంలో లింగుస్వామి కాస్త తడబడ్డాడు.క్లయిమాక్స్ తో పాటు మధ్యలో కొన్ని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా కూడా స్క్రీన్ ప్లే లో మాత్రం కన్సిస్టెన్సీ కొరవడింది.ఫస్ట్ హాఫ్ లో టీం ఎఫిల్లింగ్ సీన్స్ ఎక్కువపడ్డాయి.కీర్తి సురేష్ కి సరయిన కంటెంట్ ఉన్న సీన్స్ పడుంటే కామెడీ లోటు తీరిపోయేది.ఆమెకి పెట్టిన కెమెడీ పెద్దగా ఆకట్టుకోలేదు.సెకండ్ హాఫ్ డ్రైవ్ మెప్పిస్తుంది.క్లయిమాక్స్ సినిమాకి సరయిన కంక్లూషన్ గా నిలిచింది.ఓవర్ఆల్ గా మాస్ ప్రేక్షకులకు కాస్త ఊరటనిచ్చే పండగ వినోదం ఈ సినిమా అందిస్తుంది.

నటీనటులు:మాస్ సినిమాల్లో తన ఫైట్స్ తో మెప్పించే విశాల్ ని ఎక్కువమంది తెలుగు హీరోలానే చూస్తారు.ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న విశాల్ ఈ సినిమాలో కూడా తనని అభిమానించే మాస్ ప్రేక్షకులను అలరించే సరంజామా తో వచ్చాడు.ఫైట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు.ఇక రాజకిరణ్ రూపురేఖల్లో కాస్త మార్పు వచ్చింది.కాస్త లావయ్యాడు.కానీ యాక్టింగ్ లో మాత్రం ఎక్కడా తగ్గలేదు.ఇక మొదటిపార్ట్ లో మీరా జాస్మిన్ మెరుపులు మెరిపించినట్టుగానే అదే క్యారెక్టరైజేషన్ తో వచ్చిన కీర్తి సురేష్ సూపర్ అనిపించింది.ఇప్పటివరకు మనం చూడని క్యారెక్టరైజేషన్ తో హడావిడి గా,హానాగమా సృష్టించే తరహా పాత్రతో అలరించింది.ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది లేడీ విలన్ గా కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ నటన.ఆమె హావభావాలు వణుకు పుట్టిస్తాయి.ముఖ్యంగా క్లయిమాక్స్ లో ఆమె నటన కి హాట్స్ ఆఫ్ చెప్పాలి.ఏ మాత్రం బెరుకు లేకుండా ఆ పాత్రని పోషించడానికి ఒప్పుకున్నందుకు,పోషించిన తీరుకి మెచ్చుకోకుండా ఉండలేం.ఇక కీర్తి సురేష్,వారు ఇద్దరూ కూడా సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల కాస్త నేచురాలిటీ పెరిగింది.ఇక మిగతావాళ్లంతా కూడా తెలుగువాళ్ళకు పెద్దగా పరిచయం లేని తమిళ ముఖాలే.అయిన వాళ్ళనంతా కూడా కథకు తగ్గట్టుగా నటించారు.

టెక్నీషియన్స్:ఒకప్పడు తమిళ సినిమాలతో తెలుగులో అద్భుత విజయాలు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లింగుస్వామి సూర్య హీరోగా నటించిన సికిందర్ సినిమాతో మాత్రం కాస్త భయపెట్టాడు.ఆ సినిమా తర్వాత లింగుస్వామికి సినిమా ఇవ్వాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.కాకపోతే ఆల్రెడి తనకు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్,ఆ సినిమాకి సీక్వెల్ కావాలి అని ఎప్పటినుండో ఫ్యాన్స్ గొడవచేస్తుండడంతో,కథ కూడా నచ్చడంతో విశాల్ లింగుస్వామికి అవకాశం ఇచ్చాడు.అయితే విశాల్ నమ్మకాన్ని సగం వరకు నిలబెట్టుకున్నాడు లింగుస్వామి.అక్కడక్కడా తడబడినా కూడా ఏదోలా ఫైనల్ పాయింట్ కి సక్సెస్ ఫుల్ గార్చి అయిపోయాడు.అయితే ఆయన రాసుకున్న కామెడీ తమిళ్ లో వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ సో సో గా ఉన్నాయి.కానీ ఆర్.ఆర్ మాత్రం బావుంది.శక్తివేల్ సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది.మిగతావాళ్లు తమ క్రాఫ్ట్స్ లో బెస్ట్ అవుట్ ఫుట్ అందించారు.

చివరిగా: మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఎమోషన్స్ ని మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమా పర్లేదు అనిపించేలా ఉంది.అక్కడక్కడా బోర్ కొట్టించిన కూడా కోర్ ఎలిమెంట్ ని వదలకుండా సాగిపోవడంతో ఓవర్ ఆల్ గా ఓకే అనిపిస్తుంది.బాక్స్ ఆఫీస్ దగ్గర సేఫ్ అయిపోయే స్టామినా ఈ సినిమాకి ఉంది అనిపిస్తుంది.

పంచ్ లైన్:మాస్ కోడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here