సవ్యసాచి రివ్యూ

0
94
Savyasachi

విడుదల తేదీ : నవంబర్ 02, 2018
CB రేటింగ్ : 3/5
నటీనటులు : నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : చందు మొండేటి
నిర్మాతలు : నవీన్ వై. సి వి మోహన్, వై రవి శంకర్
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జే యువరాజ్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

వరుసవిజయలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ నాగచైతన్యతో సినిమా చేస్తున్నారు అనగానే ఆ బ్యానర్ కి ఉన్న రెప్యుటేషన్ వల్ల ఆ సినిమాపై అటెన్షన్ ఏర్పడింది.ఇక ప్రేమమ్ తో చైతూ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన చందూ మొండేటి ఆ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది.ఇక మాధవన్ లాంటి మైటీ ఆర్టిస్ట్ తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం,సవ్యసాచి టీజర్ లోనే కొత్త కాన్సెప్ట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చెయ్యడం,ట్రైలర్ తెచ్చిన హైప్,టూ గుడ్ అనిపించే సాంగ్ విజువల్స్….ఇలా అనేకాంశాలు కలిసొచ్చి సవ్యసాచికి మంచి బజ్ తో పాటు విపరీతమయిన పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ ఏర్పడింది.అలా భారీ అంచలనాలతో రిలీజ్ అయిన సవ్యసాచి ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంది?,మైత్రి మూవీ మేకర్స్ విజయాల పరంపర కంటిన్యూ అయ్యిందా లేదా?,చైతూ-చందూ ల కాంబినేషన్ కి మరో హిట్ దక్కిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:విక్రమ్ ఒక యాడ్ ఫిలిం మేకర్.అతను యాడ్స్ చేసే క్రమంలో తన ఎక్స్ లవర్ అయిన చైత్ర ని కలుస్తాడు.గతంలో అతన్ని ప్రేమించిన చైత్ర ఒక అపార్ధంవల్ల అతనికి దూరం అయ్యా అని తెలుసుకుని,మళ్ళీ తనిఖీ దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. చైత్ర తో కలిసి యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం యు.ఎస్ వెళతాడు విక్రమ్.విక్రమ్ తిరిగి ఇండియా తిరిగివచ్చేలోపు ఇల్లు పేల్చేయ్యడంతో అతని బావ చనిపోతాడు,అక్క గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అవుతుంది.ఇక వాళ్ళ పాప మహా ని కిడ్నాప్ చేస్తారు.హ్యాపీ గా ఉన్న విక్రమ్ లైఫ్ ని అలా చిందరవందరగా మార్చింది ఎవరు?,ఎందుకు చేసాడు?,విక్రమ్ తన మేనకోడలని ఎలా కాపాడుకున్నాడు?,అసలు ఈ టైటిల్ కి ఎలాంటి జస్టిఫికేషన్ ఇచ్చారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:ఈ సినిమా పై అందరికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన,అందరిని ఎక్సైట్ చేసిన పాయింట్ ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్.కానీ ఆ కాన్సెప్ట్ ని ట్రైలర్ లో ఎంతగా ఎస్టాబ్లిష్ చేసారో సినిమాలో కూడా అంతే ఉంది.కథలో అనేక డీవియేషన్స్ తో ఆ కొత్త కాన్సెప్ట్ డైల్యూట్ అయిపోయింది.సినిమా ఫస్ట్ హాఫ్ తో పాటు సినిమా చివరి వరకు కూడా ఆ కాన్సెప్ట్ పై వచ్చిన అనేక ఇంటర్ కట్స్ విసుగుతెప్పిస్తాయి.రిపీటింగ్ గా అనిపిస్తాయి.సినిమాకి ఇంట్రెస్టింగ్ టేక్ ఆఫ్ ఇచ్చిన డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ లో మైన్ కథలోకి వెళ్ళలేదు.విక్రమ్ పాత్ర పరిచయం,చైత్ర తో అతని లవ్ స్టోరీ,బ్రేకప్ అంటూ కాలక్షేపం చేయించాడు.మధ్య మధ్యలో వచ్చే సాంగ్స్,అక్కడక్కడా నవ్వించే కామెడీ తప్పిస్తే ఇంటర్వెల్ వరకు చెప్పుకోవడానికి ఏమీ లేదు.ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వెల్ వేసిన తరువాత సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ ఉంటుంది.కానీ మాధవన్ విక్రమ్ లైఫ్ లోకి ఎందుకు వచ్చాడు అనే కాన్ఫ్లిక్ట్ చాలా బలహీనంగా ఉంది.అలాగే హీరో,విలన్ మధ్య నడిచే మైండ్ గేమ్ కూడా చాలా రొటీన్ గా సాగింది.దాంతో చివరికి ఏం జరుగుతుంది అన్న ఆసక్తి సన్నగిల్లింది.మాధవన్ పాత్రను తీర్చిదిదిన విధానం కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.దాంతో సెకండ్ హాఫ్ కూడా ఊగుతూనే సాగిపోయింది.

నటీనటులు:పెళ్లి తరువాత మరింత మెచ్యూర్డ్ లుక్ లో కనిపిస్తున్న నాగ చైతన్య ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ ని మరింత మెరుగుపరుచుకున్నాడు.యాక్షన్ సీన్స్ లో ,డాన్స్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది.డైరెక్టర్ ని,అతని కథని నమ్మి తన బెస్ట్ అవుట్ ఫుట్ ఈ సినిమాకోసం ఇచ్చాడు చైతు.ముఖ్యంగా చైతు స్టైలింగ్ ఈ సినిమాలో చాలా బావుంది.ఇక ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా మారిన మాధవన్ పాత్ర చాలా సింపుల్ గా ఉంది.మాధవన్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కనిపించదు.మాధవన్ యాక్టింగ్ పొటెన్షియల్ ని షో కేస్ చేసే సీన్స్ ఎక్కడా కనిపించవు.ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ పెర్ఫారామెన్స్ పరంగా ఓకే అనిపించినా లుక్స్ పరంగా మాత్రం టూ క్యూట్ అనిపించింది.టాలీవుడ్ లో మంచి రేంజ్ కి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.భూమిక ఫైన్ పెర్ఫార్మెన్సెస్ లో ఇది ఒకటి.వెన్నెల కిషోర్,సత్య,షకలక శంకర్,వైవా హర్ష,విద్యుల్లేఖ…తదితరులు కామెడి పండించడంలో తలోచెయ్యి వేశారు.ఇక రావు రమేష్,తాగుబోతు రమేష్,కౌసల్య,నాగినీడు లాంటి సీనియర్ నటీనటుల ప్రెజెన్స్ సినిమా రేంజ్ పెంచింది.

సాంకేతిక నిపుణులు:మొదటి రెండు సినిమాలను తన వర్క్ తో హిట్ గా నిలిపిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా కి కట్ట పాయింట్ తీసుకోవడం వరకు ఓకే అనిపించాడు.కానీ కథా విస్తరణ,డైరెక్షన్….ఇలా ప్రతి ఒక్క విభాగంలో తడబడ్డాడు.కాన్సప్ట్ ని ముందే రిఫైన్ చేసుకోకపోవడం వల్ల అన్ని ఇంటర్ కట్స్ పడ్డాయి.ఇక చందు మొండేటి స్పెషలిస్ట్ అనిపించుకున్న డైలాగ్ వెర్షన్ కూడా చాలా పేలవంగా ఉంది.కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ కి కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేసాయి.ఈ సినిమా వరకు చందు తన ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు అనిపిస్తుంది.హీరో-హీరోయిన్ లవ్ స్టోరీ,విలన్ పాత్ర కి ఉన్న కాన్ఫ్లిక్ట్..ఇలా చాలా చోట్ల సినిమా డౌన్ ద లైన్ స్టాండర్డ్ లో ఉంది.ఈ సినిమాకి బాహుబలి లాంటి ఎపిక్ కి సంగీతం అందించిన కీరవాణి సంగీతం సమకూరుస్తున్నాడు అనగానే ఒకరకమయిన పాజిటివ్ ఫీలింగ్ కలిగింది.అయితే సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ,మూవీ కంటెంట్ కి తగ్గ మ్యూజిక్ అందించే కీరవాణి ఈ సినిమాకి కూడా తన వరకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు.పాటలు ముందే మంచి టాక్ తెచ్చుకోగా నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది.కీరవాణి సంగీతం ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి అని చెప్పుకోవచ్చు.ఇక రత్నవేలు దగ్గర పనిచేసి కృష్ణగాడి వీర ప్రేమ గాథ,లై సినిమాలకు సూపర్ రిచ్ విజువల్స్ అందించిన కామెరామ్యాన్ యువరాజ్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్.అనేక చోట్ల అతని కెమెరా పనితనం ఆకట్టుకుంది.ఇక సాంగ్స్ లో అతని ప్రతిభ,డైరెక్టర్ తో సింక్ అడుగడుగునా కనిపిస్తుంది.ఇక మైత్రి మూవీ మేకర్స్ అన్ని సినిమాల్లా ఈ సినిమాని కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా,ఖర్చుకు వెనుకాడకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు.ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి.

చివరిగా:ప్రోమోలతో చాలా ఆసక్తి రేకెత్తించిన సవ్యసాచి నిస్సారంగా ఉండి నిరుత్సాహ పరుస్తుంది.కలర్ ఫుల్ పాటలు,అక్కడక్కడా నవ్వించే కొన్ని సీన్స్,లావిష్ విజువల్స్,మాసీ ఫైట్స్ మాత్రమే ఎసెట్ గా రూపొందిన సవ్యసాచి కంటెంట్ పరంగా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది.ఈ సినిమా ఓపెనింగ్స్ బాగానే ఉన్నా బాక్స్ ఆఫీస్ ఫలితం తేలాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాలి.

పంచ్ లైన్: అపసవ్యసాచి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here