7000 స్క్రీన్ లలో విడుదల ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’

0
20
#ThugsOfHindostan
#ThugsOfHindostan

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో భారీ స్థాయిలో.. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్, సనా ఫాతిమా షేక్ వంటి భారీ తారాగణం ఉన్నా కూడా ఈ చిత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా మొదటి భాగం పర్వాలేదనిపించినా, రెండువ భాగం మాత్రం స్లోగా సాగుతుంది.. పైగా ఆసక్తిగా సాగని కథనంతో విసిగించిందట.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దేశవాప్తంగా 5000 స్క్రీన్ లలో.. అలాగే ఓవర్సీస్ లో 2000 స్క్రీన్లతో కలిపి మొత్తం 7000 స్క్రీన్ లలో విడుదల అయింది ఈ చిత్రం. అందుకే ఓపెనింగ్స్ లో మాత్రం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చెయ్యటం ఖాయంలా కనిపిస్తోంది.

అయితే సినిమా ఎలా ఉన్నా.. బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా పై బాగానే ఆసక్తిని చూపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here