తూర్పు సెంటిమెంటుతో 2వ నుంచి పవన్ పర్యటన

150
Janasena Party, Pawan Kalyan, Praja Porata Yathra

పశ్చిమ గోదావరి ప్రజాసంకల్ప యాత్ర బ్రేక్ తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి తన ప్రజా పోరాట యాత్ర నవంబర్ 2 నుంచి తూర్పు గోదావరి జిల్లాలో మొదలు పెట్టనున్నారు.ఈ సందర్భంగా టూర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ కందుల దుర్గేష్ మాట్లాడతూ-తూర్పు సెంటిమెంట్ తో తుని నుంచి ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. మంగళవారం జనసేన పార్టీ జిల్లా నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ ను ప్రకటించారు. మొదటి విడత పోరాట యాత్ర కార్యక్రమం 2వ తేదీన తుని నుండి ప్రారంభమై 9వ తేదీన కాకినాడలో బహిరంగ సభ తో ముగుస్తుంది. మొదటి విడత కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతుందని ఆయన వివరించారు.

2 వ తేదీన తుని నియోజకవర్గం, 3వ తేదీన ప్రత్తిపాడు, 4న జగ్గంపేట, 5న పెద్దాపురం, 6న పిఠాపురం, 9వ తేదీన కాకినాడ పట్టణ , రూరల్ నియోజక వర్గాల్లో జనసేన పోరాట యాత్ర కొనసాగుతుందని కందుల దుర్గేష్ వివరించారు. ప్రజా పోరాట యాత్రలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ప్రాంతాల్లో నెలకొని ఉన్న ప్రధాన సమస్యలను పరిశీలించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించే బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారని ఆయన వివరించారు.ఈ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కల్వకొలను తులసీరావు, జిల్లా కోఆర్డినేటర్ లు ప్రసంగించారు. ఆదినారాయణ, శెట్టిబత్తుల రాజబాబు, జనబాట కోఆర్డినేటర్ పంతం నానాజీ, ఎం. శేష్ కుమారి, చంద్రశేఖర్, శ్రీనివాస రావు, చోడిశెట్టి గణేష్ , బోనం చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Janase Tour
Janase Tour

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.